విజయనగరం గంటస్తంభం: అధికారం ఉంది.. మనల్ని ఆపేదెవరు అన్న చందంగా నేతలు వ్యవహరిస్తున్నారు. విజయనగరంలో మైదానాలు, ఖాళీ ప్రదేశాలు కోకొల్లలుగా ఉన్నా, కూటమి రెండేళ్ల పాలనపై సిటిజెన్ ఔట్ రీచ్ అండ్ గవర్నెన్స్ రివ్యూ ప్రోగ్రాంను బాలాజీ కూడలి సమీపంలో రోడ్డుపై మంగళవారం నిర్వహించడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకపోకలకు నరకయాతన పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లోనే నిమగ్నం కావాల్సి వచ్చింది. రోడ్డుకు అడ్డంగా భారీ స్టేజ్ వేసి, అటు ఇటు వాహనాలు వెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై నగర వాసులు పెదవి విరిచారు. రాచరికపు దర్పనాన్ని చూసి నగర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
ఉన్నట్టా.. లేనట్టా..
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన జనసేన నాయకులకు స్టేజ్‌పై చోటు కరువైంది. విజయనగరం ఎమ్మెల్యే అదితి అన్నీ తానై వ్యవహరిస్తూ జనసేన నాయకులను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం నామినేటేడ్ పదవుల్లో ఉన్న జనసేన ముఖ్య నేతలను కూడా వేదికపైకి పిలవకపోవడంపై మండిపడ్డారు. రాచరికపు బుద్ధులు పోలేదని, ప్రజాస్వామ్యంలో ఓటు వేసే ప్రజలే రాజులని గుర్తించడం మరిచిపోయారని జనసేన కార్యకర్తలు గుసగుసలాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తాచూపుతామంటూ సభ వద్దే హెచ్చరికలు చేశారు.
రాకపోకలకు తప్పని కష్టాలు
జనసేనకు చేదు అనుభవం
స్టేజ్‌పైకి ఆహ్వానం కరువు
స్థానిక సమరంలో తేల్చుకుంటామన్న
జనసేన శ్రేణులు


