అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం ప్రదర్శన

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

విజయనగరం అర్బన్‌: స్థానిక గాజులరేగలోని సీతం ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ప్రొఫెసర్‌, డీన్‌ (రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) డాక్టర్‌ వీజీ ప్రసూన అంతర్జాతీయ స్థాయి సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించి విశేష గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయం సహకారంతో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘డీప్‌ టెక్‌ స్టార్టప్‌ల కోసం ఆవిష్కరణ, వ్యవస్థాపకత: వ్యవస్థాపక విశ్వవిద్యాలయాల పాత్ర’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో డాక్టర్‌ ప్రసూన ‘ఫాగ్‌–ఎడ్జ్‌ డీప్‌–టెక్‌ ఎకోసిస్టమ్స్‌ కోసం ఏఐ–ఆధారిత స్వీయ–స్వస్థత సైబర్‌ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌’ అనే శీర్షికతో పరిశోధన ప్రత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రసూనను సీతం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీరామమూర్తి అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement