శరవేగంగా పైడితల్లి చదురుగుడి ప్రారంభ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా పైడితల్లి చదురుగుడి ప్రారంభ ఏర్పాట్లు

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

విజయనగరం టౌన్‌: స్థానిక మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి చదురుగుడి ఆలయ ప్రారంభ ఏర్పాట్లను దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌, ఆలయ ఈఓ కె.శిరీష మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 తేదీల్లో అమ్మవారి చదురుగుడి ప్రారంభోత్సవం కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 25న శిఖర ప్రతిష్ట మహోత్సవం తర్వాత నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులందరూ మూడురోజుల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొని, తరించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement