● పిడుగుపాటుకు ఇద్దరు బలి
● విషాదంలో కుటుంబ సభ్యులు
భామిని/మెరకముడిదాం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు చోట్ల సోమవారం సాయంత్రం పిడుగుల వాన కురిసింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేటకు చెందిన పెనుగుదురు రాజశేఖర్(20) భామిని మండల సొలికిరి గ్రామంలోని తాతగారి ఇంటికి వేసవిసెలవుల కోసం వచ్చాడు. సొలికిరి గ్రామ యువకులతో కలిసి వంశధార తీరంలో సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాజశేఖర్ పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే మిగిలిన జట్టు సభ్యులు బాలేరు పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో తోటి స్నేహితులు, తాత, అమ్మమ్మలు పూడి సింహాచలం, సరస్వతి బోరున విలపించారు.


