● నేటి నుంచే ‘సర్’ ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియ ● జూలై 14 వరకు మ్యాపింగ్‌కు అవకాశం.. నిర్లక్ష్యం చేస్తే ఓటు గల్లంతే! ● వివాహిత మహిళలు తప్పనిసరిగా చేసుకోవాల్సిన ప్రక్రియ
విజయనగరం అర్బన్:
కచ్చితమైన, పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబి తా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. సోమ వారం నుంచి జూలై 14 వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొన సాగనుంది. ఈ లోగా మ్యాపింగ్ పూర్తి చేసుకోకపో తే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ మ్యాపింగ్ ప్రక్రియ ముఖ్యంగా 2002 తర్వాత వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్లిన మహిళల కోసం ఉద్దేశించబడింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ అంతా 2002 ఓటరు జాబితా ఆధారంగానే సాగుతుంది. వివాహం తర్వాత వేరే ఊరికి వెళ్లిన మహిళల పేర్లు ప్రస్తుతం వారు నివసిస్తున్న ఊరిలోని 2002 ఓటరు జాబితాలో ఉండవు. కాబట్టి వారు తమ ఓటు హక్కును భద్రపరుచుకోవడానికి ఈ మ్యాపింగ్ చేయించుకోవడం తప్పనిసరి. ‘సర్’లో మూడు రకాల మ్యాపింగ్ పద్ధతులు ఉంటాయి. ఓటరు తన ప్రస్తుత పరిస్థితిని బట్టి మూడు కేటగిరీల్లో ఒక దానిని ఎంచుకుని మ్యాపింగ్ చేయించుకోవాలి.
వ్యక్తిగత పరిశీలన (సెల్ఫ్ మ్యాపింగ్)
2002 సర్ ఓటరు లిస్టులో పేరు ఉండి, అదే విధంగా ప్రస్తుత 2025 ఓటరు లిస్టులో కూడా పేరు ఉన్నవారు నేరుగా బూత్ లెవెల్ అధికారి దగ్గరకు వెళ్లి ‘సెల్ఫ్ మ్యాపింగ్’ చేయించుకోవాలి.
సంతానాన్ని జోడించడం (యాడ్ ప్రొజెన్సీ)
2002 సమయంలో ఓటు హక్కు వయస్సు రాకపోవడంతో ఆ నాటి జాబితాలో పేరు లేకపోయినా, ప్రస్తుత (2025) ఓటరు లిస్టులో పేరు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. తాత, అమ్మమ్మ, నానమ్మ, తండ్రి, అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 సర్ జాబితాలో ఉంటే.. మీరు తప్పనిసరిగా ‘యాడ్ ప్రొజెన్సీ’ మ్యాపింగ్ చేయించుకోవాలి.
2002 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉన్నా, ఏదై నా కారణంతో నాటి 2002 సర్ లిస్ట్‌లో మీ పేరు లేకపోతే ఇది వర్తిస్తుంది. తల్లిదండ్రులు లేదాపూర్వీ కుల (తాత, అమ్మమ్మ, నానమ్మ) పేర్లు 2002 జాబి తాలో ఉంటే.. మీరు బీఎల్వో ద్వారా ‘సెల్ఫ్ ప్రొజె న్సీ’ మ్యాపింగ్ చేయించుకోవాలి. సొంత గ్రామానికి/పుట్టిన ఊరికి వెళ్లి, అక్కడ 2002 ఓటరు జాబితా లో మీ తల్లి లేదా తండ్రి పేరు ఎక్కడ ఉందో చూసుకుని, వారి సీరియల్ నంబరు తెలుసుకోవాలి. ఆ సీరియల్ నంబరును మీరు ఇప్పుడు నివసిస్తున్న (అత్తగారి ఊరు లేదా ప్రస్తుత నివాసం) ఊరిలోని బీఎల్వో/డీఎల్వోకు అందించాలి. అధికారులు ఆ నంబర్ ఆధారంగా మిమ్మల్ని ఇక్కడి ప్రస్తుత ఓట రు జాబితాలోకి మ్యాపింగ్ ద్వారా చేరుస్తారు.
తహసీల్దార్ కార్యాలయం నుంచి ఈ జాబితాలను ఇప్పటికే బీఎల్వోలు/అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించారు. కాబట్టి మీ పుట్టిన ఊరి బీఎల్వోను సంప్రదిస్తే ఈ జాబితా లభిస్తుంది. బీఎల్వోల వద్ద స్పష్టంగా చెప్పాలి. క్షేత్ర స్థాయిలో బీఎల్వోలుగా ఎక్కువగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు.కాబట్టి ఓటర్లు స్వయంగా బీఎల్వోల వద్దకు వెళ్లినప్పుడు.. మీ కేటగిరీని బట్టి సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రొజెన్సీ లేదా సెల్ఫ్ ప్రొజెన్సీ అనే పదాలను స్పష్టంగా చెప్పి మ్యాపింగ్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత. జూలై 14లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని ప్రజాస్వామ్య హక్కును భద్రపరుచుకోవాలి.


