●రైతుకు ముంపే.. | - | Sakshi
Sakshi News home page

●రైతుకు ముంపే..

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

●రైతుకు ముంపే.. ●మడ్డువలస ఆయకట్టులో నీరు రాదు ●పేరుకే కాలువలు

సాయన్నచానల్‌, నారాయణపు రం కాలువల మధ్యలో వేలాది ఎకరాలు మా ప్రాంతంలో ఉన్నాయి. ఈ రెండు కాలువలు ద్వారా ప్రతీ ఏడాది వరద ముంపు వస్తుంది. ఖరీఫ్‌లో చుక్క నీరు ఉండదు. వర్షాకాలం వస్తే పొలాలు నీటిలో మునిగిపోతున్నాయి. గత రెండేళ్లుగా అధికారులు మెయింటెనెన్స్‌ పనులు కూడా చేయడంలేదు.

– గురుగుబెల్లి స్వామినాయుడు, వాల్తేరు,

సంతకవిటి మండలం.

మడ్డువలస ఆయకట్టులో సకాలంలో నీరు రాదు. ఎవరికి ఫోన్‌ చేసినా ఫలితం ఉండదు. అధికారులు అందుబాటులో ఉండరు. పంటలు పోయాక మాకు సంబంధం లేదు...వ్యవసాయ శాఖను కలవండి అంటారు. వ్యవసాయానికి గడ్డు పరిస్థితి కనిపిస్తోంది.

– ముంజేటి కిషోర్‌, వండానపేట, రేగిడి మండలం

అంతకాపల్లి, పొగిరి, వీఆర్‌ అగ్రహారం ప్రాంతాల్లో తోటపల్లి కాలువలు ఉన్నాయి. ఖరీఫ్‌ కు చుక్క నీరు ఇవ్వవు. అధికారులకు ఫోన్‌ చేస్తే మేం కాదు మరొకరు వచ్చారు అంటారు. కొత్తగా వచ్చిన జేఈలు ఇదిగో అదిగో అంటూ కాలం నెట్టుకొస్తుంటారు. తోటపల్లి పిల్ల కాలువల న్నీ దయనీయంగా మారాయి.

– వాకముల్ల చిన్నంనాయుడు, అంతకాపల్లి, రాజాం మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement