● పొలంలోనే తనువుచాలించి.. | - | Sakshi
Sakshi News home page

● పొలంలోనే తనువుచాలించి..

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

బాడంగి: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన లచ్చుపతుల భవాని(42) తమ ఆవులను మేత కోసం చినమంత పొలానికి తీసుకువెళ్లింది. అక్కడ ఆవులు మేస్తుండగా సాయంత్రం 4.30 సమయంలో వర్షం ఆరంభమైంది. ఇంటికి ఆవులను తోలుకెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతురాలి భర్త వెంకటరమణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సూర్యకుమారి తమ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. తల్లి మృతితో బీటెక్‌, డిగ్రీ చదువుతున్న సాయి, మహేష్‌లు బోరున విలపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement