చంద్రబాబు పాలనపై నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ సురేష్‌బాబు, నియోజకవర్గ పరిశీలకులు నాయుడు బాబు, పార్టీ శ్రేణులు
ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి మొయిద కూడలి మీదుగా స్టేట్‌బ్యాంక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నయవంచక పాలనను ఎమ్మెల్సీ సురేష్‌బాబు జనానికి వివరించారు. కార్యక్రమంలో డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల పట్టణం, నెల్లిమర్ల మండలానికి చెందిన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, యువజన విభాగం నాయకులు బడ్డుకొండ మణిదీప్‌నాయుడు, బడ్డుకొండ ప్రదీప్‌నాయుడు పాల్గొన్నారు.


