చంద్రబాబు వెన్నుపోటు పాలనపై బొబ్బిలి ప్రజలు గర్జించారు. అధికారం కోసం అబద్ధపు హామీలతో నమ్మించి మోసం చేశారంటూ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో కదం తొక్కారు. శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులను ప్రశ్నించారు. ప్రజల గళాన్ని పోలీసులతో నొక్కించేస్తున్న ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా నినదించారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యులు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్పీటీసీలు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.


