ఉత్తమ ప్రతిభకు.. మార్కులే ‘సాక్షి’ | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రతిభకు.. మార్కులే ‘సాక్షి’

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చూపారు. అధికమంది ఉత్తమ మార్కులు సాధించారు. దీనికి ‘సాక్షి’ యాజమాన్యం అందించిన పదోతరగతి మెటీరియల్‌ దోహదపడిందని విద్యార్థులు చెబుతున్నారు. సరళంగా, వివరణాత్మకంగా, సులభంగా అర్థంచేసుకునేందుకు వీలుగా విద్యానిపుణులతో తయారుచేసిన మెటీరియల్‌ ఉత్తమ మార్కుల సాధనకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. మంచి మెటీరియల్‌ అందించి విజయంలో భాగస్వామ్యమైన ‘సాక్షి’కి కృతజ్ఞతలు చెబుతున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

593 మార్కులు సాధించా

పదో తరగతిలో 593 మార్కులు సాధించాను. నా విజయంలో ఉపాధ్యాయుల బోధనతో పాటు సాక్షి యాజ మాన్యం అందజేసిన స్టడీ మెటీరియల్‌ ఎంతగానో దోహదపడింది. సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు.

– బడే సృజన, బీజేపురం, జెడ్పీహైస్కూల్‌, జియ్యమ్మవలస

చదువుకు సాయం

పదో తరగతి విద్యార్థులకు సాక్షి యాజమాన్యం అందించిన గణితం, సైన్స్‌ సబ్జెక్టుల మేటీరియల్‌ సందేహాలను తీర్చింది. చదువుకు సహకరించింది. ఉత్తమ మార్కుల సాధనకు ఉపయోగపడింది. – బి. సాయిదీపిక (580),

జియ్యమ్మవలస జెడ్పీ హైస్కూల్‌

ఆశించిన మార్కులకు ‘సాక్షి’సహాయం

పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కుల సాధనకు ‘సాక్షి స్టడీ’ మెటీరియల్‌ సహాయపడింది. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో సందేహాల నివృత్తికి మెటీరియల్‌ దోహదపడింది. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించగలిగాను.

– ఆర్‌.నిత్యకనక వర్షిణి, సీతానగరం

మెటీరియల్‌ చదివి అధిక మార్కులు సాధించా

సాక్షి యాజమాన్యం గణితం, సైన్స్‌ సబ్జెక్టుల స్టడీమెటీరియల్‌ను చది వాను. పదోతరగతిలో 585 మార్కులు సాధించాను. అధిక మార్కుల సాధనకు ఉపాధ్యాయుల బోధనతో పాటు మెటీరియల్‌ దోహదపడింది.

– బోధంకి సాయికృష్ణ, రాచకిండాం హైస్కూల్‌

కంటెంట్‌పై పట్టు సాధించగలిగాను

మాకు పబ్లిక్‌ పరీక్షల ముందు సాక్షి యాజమాన్యం స్టడీ మెటీరియల్‌ అందించింది. ఈ పుస్తకాల్లో కంటెంట్‌ కనిపించింది. ఒక ప్రశ్న ఎన్ని రకాలుగా రావొచ్చు.. ఎన్ని విధాలుగా జవాబు ఇవ్వగలమనే అంశాలు నేర్చుకున్నాను. ప్రాక్టీస్‌ చేశాను. పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్‌గా నిలిచాను. – గొర్లె సాద్విక, చిన్నయ్యపేట

Advertisement
 
Advertisement
Advertisement