నేడు డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

విజయనగరం అర్బన్‌: డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రా ఈ నెల 2న జిల్లాలో అధికారిక పర్యటన చేయనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.

బస్సులకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి

డీటీ సీ మణికుమార్‌

విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలు తమ వాహనాల ఫిట్‌నెస్‌ పునరుద్ధరణ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయాలని విజయనగరం జిల్లా ఉప రవాణా కమిషనర్‌ డి.మణికుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఈ నెల 15వ తేదీలోపు బస్సులకు ఫిట్‌నెస్‌ తనిఖీలు పూర్తిచేయించాలని కళాశాలలు, స్కూల్‌ యాజమాన్యాలను ఆదేశించామన్నారు. గడువులోగా ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ పొందని వాహనాలపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి

కలెక్టర్‌ రామసుందరరెడ్డి

లక్కవరపుకోట: ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారాయి.. అత్యంత నిబద్దతతో అనుభజ్ఞలతో బోధన జరుగుతోంది.. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గంగుబూ డి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఎలిశెట్టి ఉమా పార్వతి 594 మార్కులు సాధించడమే దీనికి నిలువెత్తు నిదర్శనమని కలెక్టర్‌ రామసుందరరెడ్డి అన్నారు. శుక్రవారం విద్యార్థిని ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయుల బోధన తీరును ప్రశంసించారు. జిల్లాలో ని 296 ప్రభుత్వ పాఠశాలల నుంచి 11,916 మంది విద్యార్థులు ప్రథమ, 1754 మంది ద్వితీయ, 524 మంది తృతీయ శ్రేణిలో ఉతీర్ణు లయ్యారన్నారు. ఫెయిలైన వారికి ప్రత్యేక త ర్ఫీదు ఇవ్వాలని టీచర్లకు సూచించారు. ఉమాపార్వతికి మల్లివీడుకు చెందిన మాజీ సర్పంచ్‌ బోని సన్యాసిరావు(సన్ని) రూ.10వేలు నగదు బహుమతిని కలెక్టర్‌ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యాలనాయుడు, ఎంఈఓలు కూర్మారావు, జి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ టి.రమేష్‌, ఎంపీడీఓ అల్లు భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement