లక్కవరపుకోట మండలంలోని గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల సమీపంలోని కొండ ప్రాంతం గంజాయిబాబులకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు బైక్‌లను పాఠశాల ప్రహరీ పక్కన పార్క్‌చేసి కొండ ప్రాంతంలోని జాడిమామిడి చెట్టు కిందకు చేరుకుంటున్నారు. రాత్రి 12 గంటల వరకు మద్యం, గంజాయి సేవిస్తున్నారు. వీరి అరుపులు, కేకలకు గొర్రెలు, మేకల పెంపకందారులు భయాందోళన చెందుతున్నారు. మత్తులో యువకులు తూలుతూ ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తారోనని హడలిపోతున్నారు. రాత్రిపూట నిఘావేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేస్తామని ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపారు. – ఎల్.కోట


