విశాఖలో చెస్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

విశాఖలో చెస్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

విశాఖలో చెస్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

విజయనగరం: విశాఖ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు సిద్ధమయ్యారు. శుక్రవారం చెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విజయనగరం ఆధ్వర్యంలో రింగు్‌ రోడ్‌లో గల ఫైర్‌ చెస్‌ స్కూల్‌లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 70 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. వారిలో బాలుర విభాగంలో శ్రీమన్నారాయణ సాహో, జ్ఞాన ప్రజ్వాల్‌లు, బాలికల విభాగంలో ఖ్యాతిసాయి, ఎన్‌.దైన్వికలు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9,10 తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విజయనగరం సీఈఓ కేవీ.జ్వాలాముఖి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement