న్యూస్‌రీల్
వాస్తవమే..
అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి విధుల్లోకి
తీసుకోని వైనం
టీడీపీ సర్కార్ తీరుతో విస్తుపోతున్న అభ్యర్థులు
ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 9 మంది ఎంపిక
మరో మూడు పోస్టులకు ముగ్గురి ఎంపిక
వీరికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేత
ఈ నెల 7వ తేదీలోగా విధుల్లో చేరాలని ఆదేశాలు
విధుల్లో చేరేందుకు వెళ్లిన వారికి వెనక్కి పంపిన వైనం
పోస్టుల నియామకాల్లో అసలేం జరుగుతోంది...!
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నిరుద్యోగులతో బంతాట..!
జిల్లాలో 3,238 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గుర్ల, బలిజిపేట మండలాల్లో
ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
విజయనగరం ఫోర్ట్:
టీడీపీ సర్కార్ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మాదారి అడ్డదారి అన్న విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను సైతం తుంగలో తొక్కే విధంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చూసి నిరుద్యోగ అభ్యర్థులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల పోస్టుల విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని వైద్య ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
నియామక ఆదేశాలిచ్చి...
ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు కేడర్ పోస్టులకు 2024 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – 09, ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టు – 01, ఆఫీస్ సబార్డినేట్ పోస్టు – 01, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టు – 01కి నోటిఫికేషన్ ఇచ్చారు. 16 నెలల తర్వాత కొద్ది రోజులు క్రితం పోస్టుల భర్తీ పక్రియ చేపట్టారు. వీరందరికి కొద్ది రోజులు క్రితం అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. వారం రోజుల్లో విధుల్లో చేరాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఎంపికై న అభ్యర్థులు ఆర్డర్స్ పట్టుకుని ఉద్యోగాల్లో చేరేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లారు. తీరా అక్కడ అధికారులు ఇప్పుడు మిమ్మల్ని విధుల్లోకి తీసుకోం... మళ్లీ ఎప్పుడు చేరాలనేది తామే చెబుతామని చెప్పి వెనక్కి పంపినట్టు తెలిసింది. దీంతో ఎంపికై న అభ్యర్థులు చేసేదిలేక నిరాశతో వెనుదిరిగారు. అసలు తమ నియామక విషయంలో ఏం జరుగుతుందని వారు మదనపడుతున్నారు. నియామక ఆదేశాలిచ్చిన తరువాత ఈ నిర్లక్ష్యమేమిటని వారు వాపోతున్నారు.
అభ్యర్థుల్లో ఆందోళన
పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 7వ తేదీలోగా విధుల్లో చేరాలని వైద్య కళాశాల అధికారులు ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్ గడువు 7వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలు తమకు వస్తాయా? లేక టీడీపీ సర్కార్ మార్చేస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డర్స్ ఇచ్చేది మేమే కదా తేదీలు మార్చి మళ్లీ ఆర్డర్స్ ఇవ్వవచ్చని చావు కబురు చల్లగా వైద్య కళాశాల అధికారులు చెబుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో ఎప్పుడు ఇలా లేదు..
పోస్టుల భర్తీ విషయంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన ఒకటి రెండు నెలల్లో భర్తీ చేసి విధుల్లోకి తీసుకుంటారు. కానీ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును సర్వత్రా తప్పుబడుతున్నారు. ఇదేమి విడ్డూరమని ప్రశ్నిస్తున్నారు.
జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, జీడీఏ, ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన మాట వాస్తవమే. వారిని విధుల్లోకి తీసుకోలేదు. క్లారిఫికేషన్ కోసం డీఎంఈకి లెటర్ రాశాం. అక్కడ నుంచి క్లారిఫికేషన్ రాగానే విధుల్లోకి తీసుకుంటాం. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన వారినే విధుల్లోకి తీసుకుంటాం.
– డాక్టర్ దేవీమాధవి, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ వైద్య కళాశాల


