విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం సోమవా రం సాయంత్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ కె.శిరీష ఆదివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో కొలువుదీరిన పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం మేళతాళాలు, భాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలతో అమ్మవారిని వనంగుడి నుంచి గాడీఖానా, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటి వద్దనున్న చదురువద్దకు తీసుకువెళ్తారన్నారు. అక్కడ ఘటాలకు పూజలు, ఊరేగింపు అనంత రం మంగళవారం వేకువజాము నుంచి అమ్మవారు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మళ్లీ పైడితల్లి అమ్మవారు జాతర చివరి ఘట్టమైన ఉయ్యాలకంబాల మహోత్స వం తర్వాత అమ్మవారిని వనంగుడికి తీసుకువస్తామన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు.
విజయనగరం టౌన్: విజయభావన సాహిత్య సదస్సులో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం శ్రీభాష్యం హరిచంద న్ రచించిన ‘శబలత’ గ్రంథావిష్కరణను సాహితీ విజయసారథి డాక్టర్ ఎ.గోపాలరావు ఆదివారం ఆవిష్కరించారు. ప్రముఖ కవి మానాపురం రాజాచంద్రశేఖర్ సమీక్షించారు. సమ్మానకర్తగా కొంకెపూడి అనూరాధ వ్యవహ రించారు. ఈ సందర్భంగా చిరకాలం సేవలందించిన తూట బాబాజీని సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భావుకత సామాజిక వాస్తవికత ముప్పేట అల్లికగా గ్రాంథిక వ్యవహార భాషలలో సాగిన చిక్కని కవిత్వం ఈ శబలత అన్నారు. గ్రంథ రచయిత డాక్టర్ హరిచందన్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న వివి ధ అంశాలపై స్పందనగా వచ్చిన కవిత్వమన్నా రు. డాక్టర్ భైరవభట్ల విజయాదిత్య ఆహ్వానం పలకగా, పార్ధన, పద్యపఠనం చేశారు. కార్యక్రమంలో దశగ్రంథాల సుబ్రహ్మణ్యం, సోమే శ్వరరావు, బాబూజీ, హరిప్రియ, ఆముక్తమా ల్యద, చీకటి దివాకర్, మానాప్రగడ సాహితీ, తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: పట్టణం పండగ సందడిలో మునిగి తేలుతోంది. దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల తొలేళ్ల ఉత్సవాల ముందు రోజు జరుపుకునే దేశమ్మతల్లి వారోత్సవాలు సందడిగా సాగా యి. పాత బొబ్బిలి సరేపోలమ్మ ఆలయ ధర్మకర్త చోడిగంజి రమేష్‌నాయుడు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రభల ఊరేగింపు క్రతువు సరేపోలమ్మ ఉత్సవాల్లో ఏటా ఆనవాయితీగా వస్తోంది. అలాగే దిమిలి పొడుగు మనుషుల విచిత్ర వేషధారణలూ ఆకట్టుకున్నాయి. మరో పక్క దేశమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులను ఆశీర్వదించడానికా అన్నట్టు శివపార్వతులు, ఇతర దేవతామూర్తు లు, రుషుల అలంకరణలతో ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి నెట్టాయి. జంట సిరిమానులు తిలకించేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి బంధువులూ, భక్తులు ఆయా బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు.
విజయనగరం టౌన్: రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అందజేస్తున్న ఎయిర్ ప్యాకేజీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ టూరిజం జనరల్ మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ కోరారు. శాంకరీదేవీ శక్తిపీఠంతో శ్రీలంక రామాయణ యాత్రలో భాగంగా కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువరెలియా పర్యటన మే 14 నుంచి 19 వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బద్రీనాథ్ యాత్ర, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఉత్తర భారతదేశం చార్‌థామ్ యాత్ర జూన్ 12 నుంచి 23 వరకూ నిర్వహిస్తామన్నారు. వివరాలకు 9281495847, 9550166168 నంబర్లను సంప్రదించాలని కోరారు.


