వేపాడ: గత 30 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన మండలంలోని కుమ్మపల్లి గ్రామానికి చెందిన డా.పి.సి.ఆదిత్య(దర్శకుడు)ను 2026 ఇండోనేషియా 2026 ఎక్స్‌లెంట్ అవార్డు వరించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన గ్రీన్ ఇండియా పరివార్‌తో కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఇండోనేషియా కు చెందిన ఎన్‌జీఐపీఫౌండేషన్ డైరెక్టర్ పీసీ ఆదిత్యసేవలను గుర్తించి అవార్డు అందజేయడం అభినందనీయమని ఇండియా ప్రతినిధి నీరజ్ గుప్తా అభినందించినట్లు ఆదిత్య తెలిపారు. మనదేశానికి మిత్రదేశమైన ఇండోనేషియా నుంచి అంతర్జాతీయఅవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.


