ఏడీఏపై వీఏఏల ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఏడీఏపై వీఏఏల ఫిర్యాదు

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

ఏడీఏపై వీఏఏల ఫిర్యాదు

దత్తిరాజేరు: గజపతినగరం వ్యవసాయ శాఖ సహయ సంచాలకురాలి (ఏడీఏ)పై కొద్ది రోజుల క్రితం వీఏఏలు ఆంద్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం దత్తిరాజేరు, బొండపల్లి, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో రైతు సేవా కేంద్రాలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఇక్కడికి ఆమె వచ్చినప్పటి నుంచి సిబ్బంది పర్సనాలిటీ, జీవనశైలి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు, ఆమె కుమార్తె పాకెట్‌ మనీ అంత తమ జీతం ఉండదని, ఆమె ప్‌లైట్‌ టిక్కెట్‌ ఖరీదు మాజీతాలు చేయవని, ఆమె కాళ్లకు వేసుకున్న చెప్పుల పాటి విలువ మా జీతాలు ఉండవని చాలా హీనంగా.అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, ఫిర్యాదులో పేర్కొన్నారు. మాతో నిర్వహించిన మీటింగ్‌లకు ఆమె భర్త హాజరై లేనిపోని మాటలు ఆడుతున్నారని ఆమె భర్తతో కాలం చెల్లిన మందులు అమ్మించి రైతులను మోసం చేస్తున్నారని రైతు సేవా కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందిపై లేని పోని అభాండాలు వేసి అక్రమ సంబంధాలు కూడా అంటగడుతున్నారని ఫిర్యాదు చేశారు. గత ఖరీఫ్‌(2025)మందులకు 2026 జూన్‌లో తయారైనట్లు స్టిక్కర్లు తగించి మందులు అమ్ముతున్నారని సహకరించక పోతే లేనిపోని మాటలు అడుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఇలా జరగడం వల్ల ఈవిషయంపై గతంలో అధికారులు విచారణ చేపట్టినా తూతూమంత్రంగానే చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement