ఏపీటీఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

ఏపీటీఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం

విజయనగరం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (1938) విజయనగరం జిల్లా కౌన్సిల్‌ సమావేశం స్థానిక రింగ్‌ రోడ్డులోని పీఎస్‌ఆర్‌ స్కూల్‌లో ఆదివారం జరిగింది. తొలుత జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా ఆర్‌.కష్ణ, అధ్యక్షుడిగా ఎన్‌.వి. పైడిరాజు, ప్రధాన కార్యదర్శిగా గంట సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏవీ శ్రీనివాసరావు, సీహెచ్‌. రామారావు, బి.శరత్‌కుమార్‌, గుమ్మడి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా పి.దామోదర్‌ నాయుడు, కేవీ రమణ, కె.శ్రీనివాసులు, ఎన్‌. సూర్యనారాయణ, పి.రమేష్‌ నాయుడు, జి.వెంకటరమణ, ఎన్‌. చిన్నాదేవి, కె. త్రినాథరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎ. సదాశివరావు, డి.ఈశ్వరరావు, వై.సత్యం, ఎం.బలరాం నాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.వి.పైడిరాజుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలపై పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు డి. ఈశ్వరరావు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement