గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిధి నందివానివలస గ్రామంలో ఆదివారం ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేసింది. మజ్జి సింహాచలం అరటి తోటపై దాడి చేయడంతోసుమారు రూ.50 వేల నష్టం వాటిల్లింది. చౌడాడ శ్రీను భూముల్లో పైపులు, బెండులు పాడవడంతో నీరు వృథా అయింది. గోళ్ల అన్నపూర్ణ అరటి తోట కూడా దెబ్బతింది. పంట కోత సమయంలో ఇలాంటి నష్టాలతో ఆర్థికంగా కుంగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏనుగులను తరలించి, నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.


