తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన ప్రమాదం

Apr 26 2026 5:15 AM | Updated on Apr 26 2026 5:15 AM

తప్పిన ప్రమాదం

● గ్యాస్‌ బండ పైపు నుంచి చెలరేగిన మంటలు

లక్కవరపుకోట : మండలంలోని బీసీ కాలనీలో ఒక ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వీధిలోకి పరుగులు తీసింది. ఏం జరుగుంతుందో తెలియకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బీసీ కాలనీలో పొలమరశెట్టి వెంకటరావు భార్య శనివారం మధ్యాహ్నం వంట చేస్తుండగా గ్యాస్‌ పైపు నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి బయటకు పరుగులు తీసి ఇరుగు పొరుగు వారికి చెప్పింది. దీంతో స్థానికులు ఇంటిలోకి వచ్చి చూడగా మంటలు రేగి వంటింట్లో గల సామాన్లు కాలిపోయాయి. మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. స్థానిక యువత పోలీసులకు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement