విజయనగరం ఫోర్ట్: పనితీరు ఆధారంగా గ్రామ సంఘం అసిస్టెంట్‌ల గౌరవ వేతనాలను ప్రతీ నెల సమయానికి జనరేట్ చేయాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఎంఎస్ అకౌంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 31 నాటికి మండల సమాఖ్యలలో ఉన్న బ్యాంకు ఖాతాలు, బ్యాంకు బ్యాలెన్స్‌లు కన్ఫర్మేషన్ ఆన్‌లైన్ పూర్తి చేయాలన్నారు. రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్నల్ ఆడిట్‌లో గమనించిన అంశాలను, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలన్నారు. గ్రామ సంఘాల, మండల సమాఖ్యలు నిధుల స్థితిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంస్థాగత నిర్మాణం వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. మండల సమాఖ్య నిర్వాహణ ఖర్చులు మొత్తం ఆదాయానికి 30 శాతంకు లోపే ఉండేలా వ్యయ నియంత్రణ చేయాలన్నారు. గ్రామ సంఘాల్లో ఉన్న సొంత నిధుల స్థితిని తెలుసుకుని అంతర్గత అప్పులు ఇవ్వడం, తిరిగి రికవరీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు సంచాలకులు కె.సావిత్రి, డీపీఎంలు ఎ.చిరంజీవి, సీతారామయ్య, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస పాణి


