ఎరువులు, పురుగుమందులపై గడిచిన 2025 ఖరీఫ్ సీజన్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ 2026గా పేర్కొనడం వ్యవసాయ సిబ్బందిని అశ్చర్యానికి గురిచేసింది. తీగలాగితే డివిజన్ స్థాయి వ్యవసాయాధికారి, ఆమె భర్త అరాచకాలు వెలుగుచూశాయి. డీలర్లకు వాట్సాప్‌లో ఎరువుల అమ్మకం సూచనలు, ఒత్తిడి సందేశాలు కనిపించాయి. ఇలాంటి నాసిరకం, నకిలీ ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తే రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతో ఆధారాలు సేకరించారు. వాటితో కలిపి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమెకు రాజకీయ పలుకుబడి దండిగా ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏమీ చేయలేరన్న ధీమా వ్యక్తం చేస్తుండడం ఉద్యోగులను విస్మయపరుస్తోంది.
డీలర్లకు వాట్సాప్‌లో
పంపిన పురుగు
మందుల జాబితా


