పాలిసెట్‌కు 90 శాతం హాజరు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు 90 శాతం హాజరు

Apr 26 2026 5:15 AM | Updated on Apr 26 2026 5:15 AM

విజయనగరం అర్బన్‌: పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌–2026) పరీక్ష ఉమ్మడి విజయనగరం జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. విజయనగరం, నెల్లిమర్ల, పార్వతీపురం, చీపురుపల్లి, బొబ్బిలి పట్టణాల్లో ఏర్పాటు చేసిన 26 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 8,054 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 7,222 మంది పరీక్షకు హాజరయ్యారు. 832 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 90 శాతం హాజరునమోదైనట్టు పరీక్షల జిల్లా కన్వీనర్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ తెలిపారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పాలిసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ధీరా ఫౌండేషన్‌, సత్య డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, సీతం కళాశాల సంయుక్తంగా విజయనగరం, గరివిడి, ప్రాంత్రాల్లోని పరీక్ష కేంద్రాల వద్ద మజ్జిగను పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement