రాజాం: రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. ఓ వైపు బెల్ట్ షాపులకు నిరంతరం సరఫరా అవుతోంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. రాజాంలో ఎకై ్సజ్ అధికారులు శనివారం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో సీతంపేట మద్యం దుకాణంలో విక్రయించాల్సిన మద్యం బాటిళ్లు రాజాంలోని దుకాణాల్లో ప్రత్యక్షమయ్యాయి. గుట్టుచప్పుగా విక్రయాలు చేయడంపై ఎకై ్సజ్‌శాఖ సీఐ ఆర్.జైభీమ్‌తో పాటు సిబ్బంది ఆరా తీశారు. దాడుల్లో 192 మద్యం బాటిళ్లు సీతంపేట మద్యం దుకాణానికి చెందినవిగా గుర్తించారు. వీటి విలువ రూ.19 వేలు ఉంటుందని అంచనా వేశారు. అయితే, మద్యంబాటిళ్లు సీజ్‌చేసిన ఎక్‌పైజ్‌శాఖ పోలీసులు విషయం బయటకురాకుండా జాగ్రత్తపడడం అనుమానాలకు తావిస్తోంది.
సిండికేట్‌లో ‘పచ్చ’పాతం
రాజాం మండలంతో పాటు నియోజకవర్గంలోని రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లోని వైన్‌షాపులన్నీ సిండికేట్‌గా మారి మద్యం వ్యాపారం చేస్తున్నాయి. వేలంపాటలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారంతా సిండికేట్‌గా మారి ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఏ దుకాణానికి ఇచ్చిన బాటిళ్లు ఆ దుకాణంతో పాటు ఆ ఏరియాలో మాత్రమే విక్రయించాలి. ఇక్కడ సిండికేట్‌లో కొంతమంది వ్యాపారులు తమకు ఇతర ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల నుంచి సరుకును అక్రమంగా తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. మిగిలిన వ్యాపారులకు తెలియకుండా గుట్టుగా ఈ వ్యాపారం నిర్వహణ జరుగుతోంది. ఈ అక్రమ వ్యాపారం ఎంతకాలం నుంచి నడుస్తోందన్న వివరాలపై ఎకై ్సజ్ శాఖ ఆరా తీస్తోంది. రేగిడి మండలానికి చెందిన ఓ టీడీపీ నేత మద్యం దారిమళ్లిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. మద్యం అక్రమ వ్యాపారం వివరాలన్నీ తెలుసుకున్నాక మీడియా సమావేశంలో వెల్లడించి కేసు నమోదుచేస్తామని రాజాం ఎకై ్సజ్ సీఐ తెలిపారు.
ఎకై ్సజ్‌శాఖ దాడుల్లో బయటపడిన ఇతర ప్రాంతాల
మద్యంబాటిళ్లు


