కొత్తవలస మండలంలోని మంగళపాలెం, తాడివానిపాలెం గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు కొంతమందితో కలిసి ఈ నెల 17వ తేదీన చింతపాలెంలోని తమ షాపులు, సమాధులను ధ్వంసం చేశారు.. చంపేస్తామంటూ బెదిరించారు.. కులం పేరుతో ధూషించారు.. పోలీసులు కేసు నమోదుచేసినా సక్రమంగా విచారణ జరగలేదు... పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు.. న్యాయం జరిగేవరకు నిరాహార దీక్ష చేస్తానంటూ చింతలపాలెం గ్రామానికి చెందిన బోని లక్ష్మి వివాదాస్పద స్థలంలో శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. నిందితులు బహిరంగంగా తిరుగుతున్నా అరెస్టు చేయకపోవడం అన్యాయమన్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోవడం విచారకరమని, నిందితులను శిక్షించేవరకు దీక్ష సాగిస్తానని స్పష్టం చేశారు. ఆమె దీక్షకు బీఎస్పీ రాష్ట్ర కార్యద్శి బోని కృష్ణ సంఘీభావం తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తిచేశారు. – కొత్తవలస


