● హెచ్చరిక.. మాకోలెక్కా..? | - | Sakshi
Sakshi News home page

● హెచ్చరిక.. మాకోలెక్కా..?

Apr 26 2026 5:15 AM | Updated on Apr 26 2026 5:15 AM

చిత్రం చూశారా... బొబ్బిలి మండలం నారాయణప్పవలస గ్రామంలోని వెంకమ్మ చెరువు ఇది. దాదాపు అరెకరం వరకు చెరువులో గ్రావెల్‌వేసి పక్కా కట్టడానికి పునాదులు వేశారు. గతంలో చెరువులో గ్రావెల్‌వేసి కప్పుతున్న విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్‌ ఎం.శ్రీను పరిశీలించారు. చెరువును కబ్జాచేయడం నేరమని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన కొందరు బోర్డును తొలగించి మళ్లీ గ్రావెల్‌ వేసి, కాంక్రీటుతో పక్కాగా పునాదులతో నిర్మాణం చేపట్టారు. గ్రామ అవసరాలకు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నా వాల్టా చట్టం ప్రకారం చెరువు దురాక్రమణ నేరమని తహసీల్దార్‌ స్పష్టంచేశారు. పరిశీలించి, కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. చెరువులో అక్రమనిర్మాణం విషయం తెలియదని వీఆర్వో చెప్పడం కొసమెరుపు. – బొబ్బిలి రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement