–8లో
వారంతా మడ్డువలస ప్రాజెక్టుకు భూము లిచ్చి నిర్వాసితులుగా మారిన మత్స్యకా రులు. దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టులోని చేపలవేటే వారికి జీవనాధారం. ఇన్నాళ్లూ లీజు విధానంలో కొంత ప్రభుత్వానికి ముట్టజెప్పి చేపలవేట సాగిస్తున్నారు. పాత సంఘం కట్టాల్సిన బకాయిల బరువు ఇప్పుడు వారికి శాపంగా మారిం ది. లీజు స్థానంలో వేలం నిర్వహిస్తామన్న ప్రభుత్వ ఉత్తుర్వులు కంటిమీద కునుకులే కుండా చేస్తున్నాయి. వేలంపాట తేదీ సమీ పిస్తున్నకొద్దీ గుండెలు బరువెక్కుతు న్నాయి. జీవనం కోల్పోతామన్న బెంగ వెంటాడుతోంది. ఉన్నతాధికారులు స్పందించి వేలం స్థానంలో పాత (లీజు) పద్ధతిలోనే చేపలవేటకు అనుమతి ఇవ్వాలని, వేలం వేసి బతుకు ఆసరా దూరం చేయొద్దంటూ వేడుకుంటున్నారు.
● ఇదీ పరిస్థితి...
దోమ చిన్నదే..వ్యాధి పెద్దది..!
మలేరియా కారక దోమ చిన్నదే అయినా కుడితే ఆస్పత్రికి పరుగు తీయాల్సిందే. వైద్యసేవలు పొందాల్సిందే.
వీడిన మర్డర్ మిస్టరీ
విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పావాడ హరనాథ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
వంగర:
మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వేలం పాట నిర్వహిస్తామన్న ప్రభుత్వ ప్రకటన మత్స్యకారుల జీవనబాటకు శాపంగా మారింది. దశాబ్దాల నాటి లీజు నిబంధనను తుంగలోకి తొక్కి వేలం నిబంధన అమలుకు సన్నద్ధం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకార సంఘం బకాయిలు కొత్త సంఘంపై రుద్దడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. మడ్డువలసలో చేపలవేటకు ఈ నెల 28న కొట్టిశ గ్రామంలో బహిరంగ వేలం వేస్తామని మత్సశాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వులు వెనుకకు తీసుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. పాత పద్ధతిలో చేపల వేటకు అనుమతి ఇవ్వాలని.. లేదంటే తమకు చావేశరణ్యమంటూ ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులను కలిసి ప్రాథేయపడుతున్నారు. వినతులు అందజేస్తున్నారు.
మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం సమయంలో భూములు, ఇళ్లతో పాటు సర్వం ఽకోల్పోయిన నిర్వాసితులైన వారే ప్రస్తుతం మత్స్యకారులుగా మారి ప్రాజెక్టులో చేపలవేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2002లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి జాతికి అంకితం చేసినప్పటి నుంచి ప్రాజెక్టులో చేపలు వేటే ఆధారంగా బతుకుతున్నారు. అప్పటి నుంచి ఏటా కొంత డబ్బును లీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి చేపలవేట సాగిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల గడిచిన తరువాత గత కొన్నేళ్ల కిందట లీజు సొమ్ము చెల్లింపులో జాప్యం జరిగింది. 1431, 1432, 1433, 1434 ఫసలీలకు సంబంధించి రూ.45 లక్షలు లీజు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి 2025లో అప్పటి మత్స్యకార సంఘం కాలపరిమితి ముగిసింది. గత ఏడాది నవంబర్ నెలలో కొత్తగా మత్స్యకార సంఘం ఏర్పాటైంది. ఈ సంఘానికి పాత ఫసలీ సొమ్ముతోపాటు ప్రస్తుతం ఉన్న 1435వ ఫసలీ సొమ్ము రూ.18,21,817లు కలిపి రూ.63 లక్షలు చెల్లించాలని మత్స్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలా చేస్తేనే సంఘం ద్వారా చేపలవేట చేసుకునేందుకు లీజు ఆర్డర్ అందజేస్తామని, లేని పక్షంలో లీజు ఆర్డర్ ఇవ్వబోమని, బహిరంగ వేలం(ఓపెన్ ఆక్షన్) వేస్తామని అధికారులు ప్రకటించారు.
ఇదెక్కడి అన్యాయం...
ప్రస్తుతం బకాయి ఉన్న 1435 ఫసలీ సొమ్ము చెల్లిస్తామని, బహిరంగం వేలం కాకుండా లీజు ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, ఇదెక్కడి అన్యాయమని మత్స్యకారులు వాపోతున్నారు. మత్స్యకారుల్లో విబేధాలు సృష్టించవద్దని కోరుతున్నారు. మడ్డువలస ప్రాజెక్టు చుట్టూ 10 చేపల రేవులు ఉన్నాయి. ఈ రేవుల పరిధిలో 462 మంది మత్స్యకారులు చేపలవేట సాగిస్తారు. బహిరంగ వేలంలో సుమారు రూ.18 లక్షలు చెల్లించాలంటే ఏ ఒక్క మత్స్యకారుడికి సాధ్యంకాదని వాపోతున్నారు. పాత బకాయిలు (1431–1435) ఫసలీలకు సంబంధించి తమ సంఘం కాల పరిధిలో లేవని, న్యాయం చేయాలంటూ మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు గత ఏడాది నవంబర్ నెలలో విశాఖపట్నం మత్స్యశాఖ డీడీ దర్యాప్తు చేశారని, ఆ నివేదిక ఏమైందో ఎవరికీ తెలియడం లేదన్నారు. ఆ నివేదిక ప్రకారం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మడ్డువలస ప్రాజెక్టులో చేపల వేటకు ఈ నెల 28న కొట్టిశలో బహిరంగ వేలం
మత్య్సకారులకు నోటీసులు జారీ
ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
వేలం రద్దుచేసి పాతవిధానంలో లీజు ఆర్డర్ జారీచేయాలని డిమాండ్
పాత నిబంధన కొనసాగించాలంటూ ఉన్నతాధికారులకు వినతి
ఉన్నతాధికారుల ఆదేశాలతో...
మత్స్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో బహిరంగ వేలం వేసేందుకు ఆదేశాలిచ్చాం. గత కొన్నేళ్లుగా ఐదు ఫసలీల కింద సుమారు రూ.63 లక్షలు మత్స్యకార సంఘం చెల్లించాల్సి ఉంది. అలా పూర్తి స్థాయి డబ్బును చెల్లిస్తే తప్ప లీజు ఆర్డర్ ఇవ్వబోం. ఈ నెల 28న బహిరంగ వేలం నిర్వహిస్తాం.
– సీహెచ్‌వీవీ ప్రసాద్, మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్, రాజాం
మడ్డువలస ప్రాజెక్టులో చేపలవేట అంశంపై బహిరంగ వేలం నిలుపుదల చేయాలి. లేదంటే మత్స్యకారుల్లో విబేధాలు తలెత్తుతాయి. 1435 ఫసలీ సొమ్ము కట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. లీజు ఆర్డర్ ఇవ్వాలి. మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలతో మత్స్యకారుల్లో ఆందోళన ఉంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి మత్స్యాకారులకు న్యాయం చేయాలి.
– పెనుబోతు దుర్గారావు,
శ్రీసీతారామఫిషర్‌మెన్ సొసైటీ అధ్యక్షుడు, కొట్టిశ


