విజయనగరం అర్బన్: ఆర్థిక బకాయిల చెల్లింపు, పెండింగ్ డీఏలు విడుదల, కొత్త పీఆర్సీ అమలు, 30 శాతం ఐఆర్ చెల్లింపు వంటి డిమాండ్లపై విజయవాడలో శనివారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ధర్నాకు జిల్లాలోని పీఆర్టీయూ నాయకులు తరలివెళ్లారు. విజయనగరం జిల్లా నుంచి 45 కార్లు, 11 ఏసీ బస్సుల్లో శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డి.శ్రీనివాస్, రావాడ రామకష్ణ, చిట్టి రామునాయుడు, పెంకి శ్రీనివాస్, ఎస్.కోట నుంచి ఇందుకూరి అశోక్‌రాజు, మోహన్‌రాజు, సూరిబాబు, చీపురుపల్లి నుంచి రవీంద్రనాయుడు, గజపతినగరం నుంచి రావాడ రాంబాబు నాయకత్వంలో ఉపాధ్యాయులు విజయవాడ వెళ్లారు.


