● ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.
● ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
● దోమ తెరలు వినియోగించాలి.
● ఇంటి కిటికీలకు మెస్‌లు బిగించాలి.
● తాగిపడేసిన కొబ్బరి బొండాలు, వాడిన టైర్లు ఇంటి పరిసరాల్లో ఉండకూడదు.
● వాటర్ ట్యాంకులకు మూతలు వేయాలి.
● మలాథియన్ స్ప్రేయింగ్ ఇంటి లోపల, బయట చేయించుకోవాలి.
విజయనగరం ఫోర్ట్: మలేరియా పేరు వినగానే జనం భయపడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా భయపడేవారు. మలేరియా బారిన పడి అస్వస్థతకు గురయ్యేవారు కొందరు..వ్యాధితో పోరాటం చేయలేక మృత్యువాత పడేవారు మరికొందరు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ఆస్కారం ఉంది. శనివారం ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
అప్పుడే మొదలైన మలేరియా వ్యాప్తి
సాధారణంగా వర్షాకాలంలో మలేరియా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అధికంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం మైదానం, గిరిజన ప్రాంతం తేడా లేకుండా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా వర్షాకాలం రాకముందే వ్యాధి వ్యాప్తి మొదలైంది.
మలేరియా వ్యాప్తికి దోమలే కారణం
అనాఫిలిస్ అనే దోమ కుట్టడం వల్ల మలేరియా సోకుతుంది. జూన్ నుంచి ఆక్టోబర్ మధ్య కాలంలో ఎక్కువగా మలేరియా కారక దోమలు వ్యాప్తి చెందుతాయి. అనాఫిలిస్ దోమ మలేరియా వ్యాధి క్రిములను రోగి నుంచి ఆరోగ్యవంతులకు కూడా చేరవేస్తుంది. వర్షాకాలం సీజన్‌లో తరచూ వచ్చే వ్యాధి మలేరియా. దీని లక్షణాలు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా కారక సూక్ష్మక్రిములు, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిఫారమ్, ప్లాస్మోడియం బవెల్ రూపంలో ఉంటాయి.
వ్యాధి లక్షణాలు:
మలేరియా సోకితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని సార్లు చలికూడా వేస్తుంది. పాల్సిఫారమ్ మలేరియా తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన రెండుగంటలలోపు ఆస్పత్రిలో చేర్పించాలి. తలనొప్పి, ఒంటినొప్పులు, వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు చేయించాలి. రోజు విడిచి రోజు జ్వరం రావచ్చు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతులకు కుట్టిన 10 నుంచి14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి. జ్వరంతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి.
జిల్లాలో 56 కేసులు నమోదు
జిల్లాలో జనవరి ఒకటో తేది నుంచి ఏప్రిల్ 23 వతేదీవరకు 56 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 2025లో 390 మలేరియా కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో మొదలైన మలేరియా వ్యాప్తి
ఇప్పటివరకు 56 కేసుల నమోదు
మలేరియా పట్ల నిర్లక్ష్యం తగదు..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
2025– 26 లో 390 కేసులు నమోదు
నేడు ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం
వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
చర్యలు తీసుకుంటున్నాం:
మలేరియా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి సోకే ప్రాంతాల్లో దోమల నివారణ మందును మేఒకటో తేదీనుంచి మొదటి విడత స్ప్రేయింగ్ చేయించనున్నాం. జిల్లాలోని 19 మండలాల్లో గల 26 పీహెచ్‌సీల పరిధిలో 165 హైరిస్క్ గ్రామాల్లో స్ప్రేయింగ్ చేయించనున్నాం.
ఎం.సింహాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి


