శృంగవరపుకోట: వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్.కోట మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మండలంలోని గవరపాలెం గ్రామానికి చెందిన కాండ్రేగుల ఈశ్వరరావు(48) కొంత కాలం పాటు దుబాయ్‌లో వెల్డర్‌గా పనిచేసి ఆరేళ్ల క్రితం స్వంత గ్రామానికి వచ్చి భవానీనగర్ వద్ద వెల్డింగ్ దుకాణం పెట్టుకుని పని చేస్తున్నాడు. శుక్రవారం గంట్యాడ మండలంలోని మధుపాడ పంప్‌హౌస్ వెనుక ఉన్న షెడ్ నిర్మాణ పనులకు వెళ్లాడు. అక్కడ వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు ఈశ్వరరావు భార్య వ్యవసాయ పనులు చేస్తుండగా, ఇద్దరు కుమారులు షిప్‌లో పని చేస్తారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.
నేల బావిలో పడి వృద్ధుడు..
రామభద్రపురం: మండలంలోని తారాపురంలో శుక్రవారం ప్రమాదవశాత్తు నేల బావిలో పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా లక్ష్మణరావు(77) శుక్రవారం ఉదయం పొలం పనికి వెళ్లాడు. అయితే దాహం వేయడంతో గ్రామం సమీపంలో ఉన్న చాకిరేవు పొలంలో సామంతుల కొత్తయ్య మాస్టారుకు చెందిన నేలబావిలో నీరు తాగడానికి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందాడు.కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు హెచ్‌సీ ఎం.సత్యనారాయణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.


