బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పల్లి రామునాయుడు తన అనుచరులతో కలిసి గురువారం బోడసింగిపేటలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఆయన టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరించగా, తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో విభేదాల కారణంగా తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరగా అయనకు పార్టీ కండువా కప్పి జెడ్పీ చైర్మన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ బొత్స అప్పలనరసయ్య, గ్రామ నాయకులు గొల్లు సతీష్, మూకల చలం నాయుడు, పల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.


