వాడవాడలా ఆవకాయ ఘుమఘుమలు | - | Sakshi
Sakshi News home page

వాడవాడలా ఆవకాయ ఘుమఘుమలు

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

వాడవాడలా ఆవకాయ ఘుమఘుమలు

విజయనగరం గంటస్తంభం: వేసవి ఎండలు మండుతుంటే పల్లెల్లో మాత్రం మరో రకమైన సందడి మొదలవుతుంది. చెట్ల మీద పచ్చగా వేలాడే మామిడికాయలు కంటికి హాయిగా కనిపిస్తే, ఇంటింటా ఆవపిండి కాలం వచ్చింది అనగానే గ్రామాల్లో మహిళల కళ్లల్లో ప్రత్యేక మెరుపు కనిపిస్తుంది. మామిడికాయలు ఇంటికి చేరగానే అసలు పని మొదలవుతుంది. ముక్కలు కోసి,ఆవపిండి కలిపి,నూనె పోసి..చివరికి పెద్ద జాడీల్లో నింపే సమయం వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో అందరూ ఉంటారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వాడవాడలా ఆవకాయ సందడి కనిపిస్తోంది. గ్రామాల్లో మాత్రమే కాదు..పట్ట ణాల్లో కూడా ఇంటింటా ఆవకాయ సీజన్‌ మొదలైంది. మార్కెట్లలో మామిడికాయలకు డిమాండ్‌ పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement