ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం

పూసపాటిరేగ: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని విశాఖ రీజియన్‌ ప్రకృతి వ్యవసాయం టెక్నికల్‌ మేనేజర్‌ కె.ప్రకాష్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పూసపాటిరేగ మండలంలోని గోవిందపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులకు ముగింపు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సాగులో అవలంబించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. నిరంతర ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా అందుబాటులోకి తీసుకోవాలి అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ సిబ్బంది ఇన్‌పుట్‌ ప్రిపరేషన్‌, ఉపయోగాలపై పూర్తిస్థాయిలో తెలియజేశారు. తొలకరికి 15 కేజీల విత్తనాల కిట్‌లు అందజేస్తామన్నారు. తొలకరి సాగుకు 30 రకాల విత్తనాల ద్వారా పచ్చిరొట్ట ఎరువులు తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్‌ వ్యవసాయ అధికారి అడ్డూరి శ్రీని వాసరావు, విస్తరణాధికారి ఎస్‌.భాను, ప్రకృతివ్యవసా యం సిబ్బంది కమల, అశ్వని తదితరులు పాల్గొన్నారు.

టెక్నికల్‌ మేనేజరు ప్రకాష్‌

Advertisement
 
Advertisement
Advertisement