ఘనంగా వేదగాయత్రీమాత ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వేదగాయత్రీమాత ఆలయ వార్షికోత్సవం

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

ఘనంగా వేదగాయత్రీమాత ఆలయ వార్షికోత్సవం

విజయనగరం టౌన్‌: సనాతన గురుకులాశ్రమ గాయత్రి శ్రీ విద్యాపీఠం 33వ వార్షిక బ్రహ్మోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూల్‌బాగ్‌లోని ఉన్న విద్యాపీఠం ఆవరణలో కొలువైన అమ్మవారికి యనమండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి విమలానందనాథ గురువర్యులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ విద్యాపీఠంలో కొలువైన గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూప సంధ్యామూర్తులకు అష్టోత్తరశత కలశాభిషేకం, పంచామృతాభిషేకాలు, శ్రీ చక్ర కుంకుమార్చన, గాయత్రి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి, తరించారు.

Advertisement
 
Advertisement
Advertisement