లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వృద్ధుడు | - | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వృద్ధుడు

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వృద్ధుడు

విజయనగరం క్రైమ్‌: స్థానిక దాసన్నపేట వసంత విహార్‌ సమీప వైష్ణవి నిలయం అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఓ పెద్దాయన గురువారం ఇరుక్కుపోయాడు. వైష్ణవి నిలయంలో ఉంటున్న ఓ పెద్దాయన తన అపార్టెమెంట్‌లోకి వెళ్లేందుకు లిప్ట్‌ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో లిఫ్ట్‌ పైభాగం ఒక్కసారిగా విరిగి కింద జారి పడిపొయంది. దీంతో లిఫ్ట్‌ ఎక్కబోతున్న పెద్దాయనపై లిప్ట్‌ రూఫ్‌ ఒక్కసారిగా పడడంతో కాలు బయట ఉండిపోయే విధంగా అదే లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే వైష్ణవి నిలయంలో ఉన్న వారు కరెంట్‌ నిలిపివేసి లిఫ్ట్‌ను ఆపారు.అందులో ఇరుక్కుపోయిన పెద్దాయనను తక్షణమే సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సమాచారం అందుకున్న టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌ వివరాలు కనుక్కుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement