గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించేలా సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ నిర్వహించాం. ఇటీవల 84 మంది విద్యార్థులు భువనేశ్వర్ వెళ్లి వచ్చారు. నేరుగా వారికి అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో దృశ్యరూప అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన చేయించాం. విద్యార్థులు వారు తిలకించిన ప్రదేశాలు, అక్కడి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ద్వారా తెలుసుకున్న ఎంతో విలువైన సమాచారాన్ని నివేదికలుగా రూపొందించనున్నారు. సహ విద్యార్ధులకు ఆ విషయాలను తెలియచేయడం, ఆ అంశాలపై చర్చరించడం ద్వారా వారిలో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను వెలికితీసేయత్నం ఈ పర్యటన. పాటోజు బ్రహ్మాజీరావు,
డీఈఓ, పార్వతీపురం మన్యం.


