10 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్‌.. | - | Sakshi
Sakshi News home page

10 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్‌..

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

10 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్‌..

విజయనగరం క్రైమ్‌: 10 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు నిందితులను విజయనగరం జీఆర్పీ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. విజయనగరం రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫామ్‌లపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాకు చెందిన బుడు బరిక, హరీష్‌ బరికలు ఒడిశా రాష్ట్రంలోని దమన్‌ జోడి నుంచి కేరళ రాష్ట్రం పాలక్కడ్‌కు సుమారు రూ. యాభై వేల విలువ చేసే 10 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. వారిద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు.

8కిలోల గంజాయితో మరో ఇద్దరు..

8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ మరో ఇద్దరు నిందితులు విజయనగరం జీఆర్పీ సిబ్బందికి గురువారం పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సంయుక్తంగా విజయనగరం రైల్వే ప్లాట్‌ఫాంలపై తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగ్‌లతో అనుమానంగా ఉండడాన్ని గుర్తించి ప్రశ్నించడంతో తడబడుతూ సమాధానం చెప్పారు. వెంటనే వారివద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీ చేయగా రూ.40 వేల విలువ చేసే 8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. పట్టుబడిన నిందితులు ఒడిశాలోని భద్రక్‌కు చెందిన ఆకాష్‌ కుమార్‌ బరిక్‌, రాయగడ జిల్లాకు చెందిన సునీల్‌ నాయక్‌లని రాయగడ నుంచి సికింద్రాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నారని ఈ మేరకు కేసు నమోదు చేసి విశాఖ కోర్టులో ప్రవేశ పెట్టగా రిమాండ్‌ విధించారని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement