విజయనగరం రూరల్: అరబిందో ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన నెల్లిమర్ల మండలం జరజాపుపేటకు చెందిన ఎం.లక్ష్మునాయుడు కుటుంబానికి అరబిందో ఫార్మా కంపెనీ అందించిన రూ. 30 లక్షల చెక్కును జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం తన కార్యాలయంలో అందజేశారు. జెడ్పీ చైర్మన్ కార్యాలయానికి విచ్చేసిన అరబిందో ఫార్మా కంపెనీ ప్రతినిధులు బాధిత కుటుంబానికి కంపెనీ యాజమాన్యం తరఫున ప్రకటించిన రూ.30 లక్షల చెక్కును జెడ్పీ చైర్మన్‌కు అందించగా ఆయన మృతుడి భార్య రమణమ్మకు అందజేశారు. అలాగే ఆమెకు అరబిందో కంపెనీలో ఉద్యోగంతో పాటు పిల్లల విద్యాభ్యాసం బాధ్యతలు కంపెనీయే చూసుకుంటుందని ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్, బాధిత కుటుంబసభ్యులకు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన అరబిందో కంపెనీ యాజమాన్యానికి కతజ్ఞతలు తెలిపారు.


