మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలి

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలి

విజయనగరం ఫోర్ట్‌: ప్రతి ఒక్కరికీ మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఈనెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాల్‌ పోస్టర్లు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల నియంత్రణకు స్ప్రేయింగ్‌ చేసేందుకు 165 హైరిస్క్‌ గ్రామాలను గుర్తించామన్నారు. మే ఒకటో తేదీ నుంచి మొదటి విడత, జూలై 15 నుంచి రెండో విడతగా స్ప్రేయింగ్‌ చేయనున్నామన్నారు. ఇంటి లోపల, ఇంటి పరిసరాల్లో ప్రజలు స్ప్రేయింగ్‌ ప్రజలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, డీఎంఓ ఎం.సింహాచలం, ఎస్‌ఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement