● పార్టీలో చేరిన 50 కుటుంబాలకు
చెందిన గజపతినగరం యువకులు
గజపతినగరం రూరల్: స్థానిక బెల్లాన కన్వెన్షన్‌లో గురువారం జరిగిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో గజపతినగరం మేజర్ పంచాయతీకి చెందిన 50 కుటుంబాల యువకులు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్చార్జ్ బొత్స అప్పలనరసయ్య, బొత్స సందీప్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు, రుంకాన భాస్కరరావు, వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, కర్రి నానాజీ, ఆల్తి రామనాయుడు ఆధ్వర్యంలో గజపతినగరం పట్టణంలో ఈ చేరికల వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు.


