ఇంటికి పోదాం..
రైల్వేస్టేషన్ ప్రాంతంలో విద్యార్థుల హడావిడి
బస్సు ఎక్కేందుకు నిరీక్షిణ, ఆర్టీసీ కాంప్లెక్సు బయట వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సామాన్లు సర్దుకుంటున్న విద్యార్థులు
2025–26 విద్యాసంవత్సరం ముగిసింది. స్కూళ్లకు శుక్రవారం నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ హాస్టళ్లలో ఉంటూ చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులతో కలిసి గురువారం మధ్యాహ్నం సొంతూళ్లకు పయనమయ్యారు. వీరి రాకపోకలతో వివిధ కూడళ్లు, బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిశాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


