● భానుడి ప్రతాపం.. రక్షకభటుల విలాపం! | - | Sakshi
Sakshi News home page

● భానుడి ప్రతాపం.. రక్షకభటుల విలాపం!

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలైతే చాలు మండిపోతున్నాడు. జనంపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వారం రోజులుగా మండుతున్న ఎండలకు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి. రాకపోకల క్రమబద్ధీకరణ కోసం వివిధ కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. కాస్త వాహనాల రాకపోకలు తగ్గిన సమయంలో చెట్ల కింద సేదతీరుతున్నారు. కొందరు మండే ఎండలోనే విధులు నిర్వహిస్తూ.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దీనికి విజయనగరం పట్టణంలో గురువారం కనిపించిన ఈ చిత్రాలే సాక్ష్యం.

– సాక్షిఫొటోగ్రాఫర్‌, విజయనగరం

Advertisement
 
Advertisement
Advertisement