నమ్మించడం.. నట్టేట ముంచడం సీఎం చంద్రబాబుకు అలవాటైన విద్య అన్నది తరచూ రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారులు... ఇలా ఎవరన్నది అనవసరం. అవసరం తీరాక మొఖంచాటేయడమే ఆయనకు తెలిసిన రాజకీయ తంత్రం. ఇప్పుడు వివి | - | Sakshi
Sakshi News home page

నమ్మించడం.. నట్టేట ముంచడం సీఎం చంద్రబాబుకు అలవాటైన విద్య అన్నది తరచూ రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారులు... ఇలా ఎవరన్నది అనవసరం. అవసరం తీరాక మొఖంచాటేయడమే ఆయనకు తెలిసిన రాజకీయ తంత్రం. ఇప్పుడు వివి

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

‘విజయనగరం మండలానికి చెందిన ఒక ఆటో డ్రైవర్‌ కొత్త వాహనం కొనుగోలుకు బీసీ కార్పొరేషన్‌ అందజేసే రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. అవసరమైన అన్ని ధ్రువపత్రాలు సమర్పించి ఏడాది దాటినా... ఇప్పటి వరకు రుణం మంజూరు కాలేదు. ఈయన ఒక్కరే కాదు... ఉమ్మడి విజయనగరం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అందరి పరిస్థితి ఇదే.’

విజయనగరం అర్బన్‌:

పేద, మధ్యతరగతి వర్గాల స్వయం ఉపాధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన బీసీ, ఎస్సీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ప్రభుత్వం తీరుతో పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది అభ్యర్థులకు రుణాలు మంజూరు కావడం లేదు. ఏడాదికి పైగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కయూనిట్‌ కూడా మంజూరు కాకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుణాలు సకాలంలో మంజూరుకాకపోవడంతో స్వయం ఉపాధికి గండిపడుతోంది.

49 వేల దరఖాస్తులు..

వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 5,863 యూ నిట్లు మంజూరు చేయాలని నిర్ణయించినప్పటికీ... 49 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అభ్య ర్ధులకు మౌఖిక పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత యూనిట్ల మంజూరు చేయాల్సిన ప్రక్రియ ఆగిపోయింది.

బీసీ కార్పొరేషన్‌ ద్వారా యూనిట్‌ విలువలో 40 నుంచి 50 శాతం వరకు రాయితీ రుణాలు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కార్పొరేషన్ల ప్రకటనలకే పరిమితం

గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. స్వయం ఉపాధి కల్పిస్తామని పాలకులు చెప్పిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి.

కార్పొరేషన్ల రుణాలు కాగితాలకే

పరిమితం

ఏడాది నుంచి లబ్ధిదారుల ఎదురు

చూపులు

స్వయం ఉపాధికి గండి

రాయితీ

నిధులే రాక... బ్యాంకులు

వెనుకంజ

Advertisement
 
Advertisement
Advertisement