జిందాల్ నిర్వాసితులు సుమారు రెండు వందల రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు వినిపించారు. సమస్యల పరిష్కారంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభించారు. మేమంతా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారమని, తమ బతుకులుతో ఆడుకోవద్దని, తమ భూములు తమకు అప్పగించాలంటూ నినదించారు. న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
– శృంగవరపుకోట


