వైఎస్సార్‌సీపీ నాయకుల ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుల ఆత్మీయ కలయిక

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుల ఆత్మీయకలయిక ప్రత్యేకతను సంతరించుకుంది. సాలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి హాజరైన రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, అరకు పార్లమెంట్‌ సభ్యులు గుమ్మా తనూజరాణి బుధవారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఇంటికి విచ్చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్‌, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు జైహింద్‌కుమార్‌ వారికి ఘన స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement