రాజకీయ కక్షతోనే... | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షతోనే...

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

రాజకీయ కక్షతో ఉద్యోగుల తొలగింపునకు పూనుకోవడం మంత్రి సంధ్యారాణికి తగదని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పీటీజీకి చెందిన కరాసవలస కేజీబీవీ ప్రత్యేకాధికారి, బోధనేతర సిబ్బందితో పాటు నియోజకవర్గంలో పలువురు ఉద్యోగులను కక్ష పూరితంగా తొలగించారని పేర్కొన్నారు. ఎన్నేళ్లు పాలించినా తనెప్పుడూ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పూనుకోలేదన్నారు. జీఓ 3 పునరుద్ధరణ, ఆశ్రమపాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం, పట్టణంలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర హామీలను ఇచ్చిన మంత్రి నేటికీ అమలుచేయకపోవడం విచారకరమన్నారు. గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు అడబిడ్డ నిధి అందని ద్రాక్షగా మారిందన్నారు. రెండేళ్లలోనే లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో నియోజకవర్గంలోని ప్రతిగ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement