సంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో అప్పమ్మ చెరువులో ఇటీవల చేపలు మృతి చెందిన విషయమై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విజయకృష్ణ ఆదేశాలతో రాజాం ఫిషరీస్ ఇన్‌న్పెక్టర్ సీహెచ్.ప్రసాదరావు బుధవారం విచారణ చేపట్టారు. అప్పమ్మ చెరువుకు చేరుకుని అక్కడి పరిస్థితులపై మత్స్యకారులతో మాట్లాడారు. చెరువునుంచి నీరు తీయకుండా అడ్డుపడ్డారనే రైతులతో మాట్లాడారు. మత్స్యకారులు పలుమార్లు చెరువునుంచి నీరు తీయవద్దని తెలిపిన రాజాం ఇరిగేషన్ ఆఫీస్ సబార్డినేట్ ముఖలింగంను చెరువు వద్దకు పిలిపించుకుని నివేదిక తీసుకున్నట్లు తెలిపారు. చెరువులో ఎంత విలువ చేసే చేపలు విడిచి పెట్టారు తదితర అంశాలను మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదికను జిల్లా మత్స్యశాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.


