బొబ్బిలి రూరల్: అమెరికాలోని మెరమెక్‌స్టేట్‌పార్కు వద్ద ఈనెల 11న ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందిన పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిశ్రీహరికృష్ణ(26)మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. ప్రమాదం జరిగిన 12 రోజుల తరువాత హరికృష్ణ మృతదేహం తల్లిదండ్రుల వద్దకు చేరగా తల్లిదండ్రులు రమ, శ్రీనివాసరావులు భోరుమన్నారు. చేతికి అందికొచ్చిన కొడుకు అకాల మరణంతో గుండెలవిసేలా విలపించారు. గ్రామస్తులు,పెద్దలు, బంధువులు హరికృష్ణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తల్లిదండ్రులను ఓదార్చారు.అనంతరం అశ్రునయనాలతో హరికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


