సాలూరు: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సాలూరు వాసి డా.రేగాన షణ్ముఖరావును బుధవారం సన్మానించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో పీఆర్‌ఓగా పనిచేస్తున్న రేగాన షణ్ముఖరావు జర్నలిజం విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థిగా, సమాచార పౌర సంబంధాల శాఖ, షెడ్యూల్ కులాల స్థితిగతులపై అధ్యయనాలు, పరిశోధనల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రముఖులు ఆయనను సన్మానించి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికను అందజేశారు. ఈ మేరకు ఆయనకు సాలూరుకు చెందిన పలువురు అభినందనలు తెలిపారు.
మొక్కజొన్నల లారీ బోల్తా
గజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ శివారులో బుధవారం మొక్కజొన్నల లోడ్ తీసుకువెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. పెదకాద, ఎం.గుమడాం, మరుపల్లి రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లోడ్ చేసి విజయనగరం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
3803 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
సీతంపేట: సీతంపేటలోని రెండు వేర్వేరు కిరాణా దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న 3803 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పార్వతీపురం డీఎస్‌వో ఆశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి స్థానిక ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఉంచినట్లు ఆర్‌ఎస్‌డీటీ శ్రీ విద్య తెలిపారు.


