విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పోర్ట్ సిటీ స్కూల్ సమీపంలో రెండు రోజుల క్రితం గుర్తించిన మృతదేహం ఎవరిది అన్నకోణంలో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని జొన్నగుడ్డికి చెందిన పావాడ హరనాథ్ (24)గా గుర్తించిన పోలీసులు హరనాథ్ రౌడీషీటర్ అని విజయనగరం వన్ టౌన్, టూటౌన్ పీఎస్‌లలో పలు హత్య కేసులు ఉన్నాయని చెబుతున్నారు. కాగా బావిలో మృతదేహం ఉందని తెలుసుకున్న పోలీసులు బయటకు తీసి పోస్ట్ మార్టానికి తరలించగా హత్యగా తేలింది. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి విజయనగరం వన్ టౌన్ సీఐ చౌదరి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.వారు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుపై సీఐఆర్వీకే చౌదరి మాట్లాడుతూ పావాడ సంతోషి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బావిలో మృతదేహాన్ని గుర్తించామని పొస్ట్ మార్గం నివేదికలో హత్యగా తేలిందన్నారు. ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో ఎనిమిది మంది


